జూన్ 10న టెట్ నోటిఫికేషన్

తెలంగాణలో భారీ ఎత్తున ఉపాధ్యయ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఉన్న పాఠాశాల్లో ఖాళీల వివరాలను సేకరించి త్వరలోనే భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. త్వరలోనే డీఎస్సీ నిర్వహిస్తామని కడియం చెప్పారు. అదే విధంగా తెలంగాణలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి కొత్తగా 26100 మంది డీఎడ్,బిఎడ్ పూర్తిచేశారని వారికి కూడా డీఎస్సీలో అవకాశం కల్పించేందుకు మరోసారి టెట్ ను నిర్వహిస్తామని కడియం చెప్పారు. జూన్ 10న టెట్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన పేర్కొన్నార. జులై23న టెట్ పరీక్ష జరుగుతుందని ఆగస్టు 5న ఫలితాలను విడుదల చేస్తామని కడీయం శ్రీహరి తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలు, నియామకాలపై కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఖాళీల భర్తీ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో కడియం  శ్రీహరి సమీక్షించారు.