ప్లాస్టిక్ బియ్యం-ప్రజల్లో కలవరం

ప్లాస్టిక్ బియ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను కలవరపెడుతోంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బియ్యం చైనా నుండి దిగుమతి అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాము తింటున్నది సాధారణ బియ్యమా లేక చైనా బియ్యా తెలియక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని మూడు ప్రాంతాల్లో ప్లాస్టిక్ బియ్యానికి సంబంధించిన కేసులు పోలీసుల వద్దకు చేరాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోనూ ప్లాస్టిక్ బియ్యాన్ని విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు చిన్న చిన్న హోటళ్లలోనూ, హాస్టళ్లలోనూ ప్లాస్టిక్ బియ్యాన్ని వండుతున్నారనే అనుమానులు వ్యక్తం కాగా తాజాగా సాధారణ  దుకాణంలో కొనుగోలు చేసిన బియ్యం ప్లాస్టిక్ బియ్యమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మీర్ పేటకు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  రెండు నెలల క్రితం కొనుగోలు చేసిన బియ్యం తింటున్నప్పటి నుండి తనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని దీనితో బియ్యాన్ని పరీక్షించి చూడాగా ప్లాస్టిక్ బియ్యంగా అతను అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. బియ్యాన్ని ముద్దగా చేసి కింద కొడితే కొంత ఎత్తు ఎగురుతోందని అశోక్ చెప్తున్నాడు. క్రికెట్ బ్యాట్ తో కొట్టిన అన్నం ముద్ద విడిపోలేదని అంటున్నాడు.  యూసఫ్ గూడాలోని ఒక హాస్టల్ విద్యార్థులు కూడా తమకు ప్లాస్టిక్ బియ్యం పెడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. ఇటీవల సరూర్ నగర్ లోనూ ప్లాస్టిక్ బియ్యం తో వండిన బిర్యానీ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. వరుసగా ప్లాస్టిక్ బియ్యంపై వస్తున్న వార్తలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్లాస్టిక్ బియ్యానికి సంబంధించి మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ప్లాస్టిక్ బియ్యంపై వస్తున్న వార్తలపై ప్రభుత్వాలు కూడా దృష్టిపెట్టాయి. బియ్యాన్ని కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. ప్లాస్టిక్ బియ్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన పౌరసరఫార శాఖ బియ్యం శాంపిళ్లను సేకరించి వాటిని ల్యాబ్ కు పంపింది. వీటికి సంబంధించిన రిపోర్టులు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆశాఖ హెచ్చరించింది. బాయిలర్ రైస్  ను పాలిష్ చేసి విక్రయిస్తున్న వస్తున్న వార్తలపై కూడా పౌర సరఫరాల శాఖ స్పందించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ఆ  శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అటు కర్నూల్ లోని పలు చోట్ల అధికారులు శాంపిళ్లను సేకరించి పరీక్షలకోసం పంపారు. అయితే ఇప్పటి వరకు ప్లాస్టిక్ బియ్యంపై అధికారికంగా ఎటువంటి నిర్థారణ జరలేదని అధికారులు స్పష్టం  చేశారు. ప్లాస్టిక్ బియ్యానికి సంబంధించి కేసును నమోదయినప్పటికీ అది ప్లాస్టిక్ బియ్యంగా నిర్థాకరణ జరగలేదు. దీనితో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *