ఆ క్రూరుడికి మానవహక్కులు గుర్తొచ్చాయి…

వాడో నరరూప రాక్షసుడు… జిహాద్ పేరుతో భారత్ పై యుద్ధానికి దిగి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించిన కిరాతకుడు… ప్రత్యేక కోర్టు విధించిన మరణ శిక్షను సవాలు చేసి తీహార్ జైల్లో ఉన్న ఉగ్రవాది…ప్రజల ప్రాణాలను హరించడంలో ఆరితేరిన వీడికి మానవ హక్కులు గుర్తుకు వచ్చాయి.  వాడే యాసిన్ బత్కల్  2013 దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుతో పాటుగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడి మానవ హక్కులకు భంగం కలుగుతున్నాయట. బాంబుపేలుళ్లకు పాల్పడిన వీడికి  ఎన్ఐఏ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లో కోర్టు మరణశిక్ష విధించగా దానిపై పై కోర్టుకు వెల్లిన బత్కల్ తిహార్ జైల్లో ఉన్నాడు. జైల్లో తన మానవ హక్కులకు భంగం కలుగుతోందని తనను జైలు  అధికారులు మానసికంగా, శారీరకంగా వేధిపులకు గురిచేస్తున్నారంటూ బత్కల్ కోర్టును ఆశ్రయించాడు. తనను తీవ్రంగా వేధిస్తున్నారని దీనిపై సీబీఐ విచారణ జరపాలంటూ కోర్టును ఆశ్రయించాడు.

పదుల సంఖ్యలో అమాయ ప్రజల ప్రాణాలు తీసి మరెందరినీ శాశ్వతంగా అవిటివాళ్లను చేసిన వీడికి ఇప్పుడు మానవహక్కులు గుర్తుకు వచ్చాయి. తనను ఒంటరిగా జైల్లు ఉంచుతున్నారంటూ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ కరడుగట్టిన నేరగాడిని ఒంటరితనం వేధిస్తోందట. జైల్లో కూడా మందిని పోగేసుకుని కుట్రలు పన్నే అవకాశం లేకుండా చేయడమే జైలు అధికారులు తప్పట. అత్యంక క్రూరమైన నేరాలకు పాల్పడిన బత్కల్ లాంటి వారు కూడా మానవహక్కుల ఉల్లంఘన అంటూ మాట్లాడడం విడ్డూరమే..