ఫ్లోరిడా కాల్పుల్లో 6గురు మృతి

 

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒర్లాండాలోని పారిశ్రామిక వాడలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ చనిపోగా మరొకరు ఆస్పత్రిలో కన్నుమూసారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి తనని తాను కాల్చుకుని చనిపోయాడు. ఓర్లాండోని ఆరెంజ్ కౌంటీలో ఈ దారుణం జరిగింది. స్థానిక పారిశ్రామిక వాడలోని ఒక కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. గతంలో ఇదే కర్మాగారంలో పనిచేసిన 45 సంవత్సరాల దుండగుడిని ఎప్రిల్ లో పనినుండి తొలగించారు. దీనితో అతను కక్ష పెంచుటుని ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తికి పెద్ద నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. చిన్నచిన్న నేరాలకు పాల్పడినట్టు పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ అవేవీ పెద్ద కేసులేమీ కావని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు ప్రాథమికంగా అంచానా వేస్తున్నారు.