అరబ్ దేశాల్లో కలకలం-ఖతార్ తో నాలుగు దేశాల తెగతెంపులు

     ప్రపంచంలోనే అత్యదిక తలసరి ఆదాయం కలిగిన దేశంగా గుర్తింపు తెచ్చుకున్న ఖతార్ తో నాలుగు అరబ్ దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి. ఈ వార్త అరబ్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. పొరుగు దేశాలను అస్థిర పర్చేందుకు కుట్రపన్నుతోందనే అరోపణలతో సౌదీ ఆరేబియా, ఈజిప్ట్,బర్హేన్,యూఏఈ లు ఖతార్ తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. సంప్రదాయ ముస్లీం పద్దతులను పాటించే ఖతార్ ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటి. ఈ దేశపు తలసరి ఆదాయం ప్రపంచంలోనే అత్యధికం. 1971లో స్వంతంత్ర్యం పొందిన నాటినుండి అభివృద్దిలో దూసుకుని పోతున్న ఖతార్ లో రాచరిక పాలన సాగుతోంది. సంప్రదాయ ముస్లీం చట్టాలను కఠినంగా అమలు చేసే ఖతార్ కు అరబ్బు ప్రపంచంలో అత్యంత కీలకమైన, ప్రభావవంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.
ఉగ్రవాదులకు, వేర్పాటు వాదులకు ఖతార్ సహాయం చేస్తతున్నదని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి. ముస్లీం బ్రదర్ హుడ్ లాంటి సంస్థలతో పాటుగా పలు సంస్థలకు ఖతార్ ఆర్థిక సహాయం అందిస్తూ తమ దేశాలను అస్థిర పర్చేందుకు కుట్రపన్నుతున్నాయని ఖతార్ తో సంబంధం తెంచుకున్న దేశాలు ఆరోపిస్తున్నాయి. ఖతార్ పౌరులు 14 రోజుల్లో తమ దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆయాదేశాలు ఆదేశాలు జారీ చేశాయి. దౌత్య సంబంధాలు తెంచుకున్నందున తమ దేశాల్లోని ఖాతార్ కు చెందిన దౌత్యకార్యాలయాను ఈ నాలుగు దేశాలు దేశాలు మూసివేశాయి. ఇక్కడి సిబ్బందిని 48 గంటల్లో స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాయి.
ఖతార్ పై నాలుగు దేశాలు తీసుకున్న నిర్ణయం వల్ల అరబ్ దేశాల్లో అనిశ్చితి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బలమైన దేశంగా పేరుపడ్డ ఖతార్ ను వెలివేసిన నాలుగు దేశాలపై ఖతార్ కూడా ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయి. అనిశ్చితికి మారుపేరుగా మారిన అరబ్ దేశాల్లో దీనితో మరో కలకలం మొదలైందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *