ప్రముఖ జర్నలిస్టు, ఎన్టీటీవీ సహ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ నివాసంలో సీబీఐ సోదాలు జరపుతోంది. ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి ఎగ్జిక్యూటివ్ కో-ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్.ఆర్.పీ.ఆర్ హోల్డింగ్స్ పేరుతో ప్రణయ్ రాయ్ నిర్వహిస్తున్న సంస్థ ఐసీఐసీఐసీ బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు చెల్లించనందుకు గాను సీబీఐ కేసును నమోదు చేసింది. ఢిల్లీలోని ప్రణయ్ నివాసంతో పాటుగా డేరాడూన్ లోని సంస్థ కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ప్రణయ్ రాయ్ తో పాటుగా ఆయన భార్య రాధికా రాయ్, ఆర్.ఆర్.పీ.ఆర్ హోల్డింగ్స్ పై సీీబీఐ కేసును నమోదు చేసింది. బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించకుండా ఎగవేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రణయ్ రాయ్ పై ఉన్న అభియోగం. ఆయన బ్యాంకు కు 398 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందంటూ వార్తలు రాగా ఆయన చెల్లించాల్సింది 48 కోట్ల రూపాయలుగా మరికొందరు పేర్కొంటున్నారు.