భారత-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. ఈ దాయాదీ దేశాల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్ ఓ హై టెక్షన్ మ్యాచే. ప్రపంచంలో ఎవరి చేతిలో ఓడిపోయినా ఫరవాలేదు కానీ దాయాదీ దేశం చేతిలో ఓడిపోకూడదన్నది ఇరు దేశాల అభిమానుల స్థిరాభిప్రాయం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ లు ఆదివారం తలపడనున్నాయి. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇరు దేశాల అభిమాలు చేరుకోగా కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రపంచంలో ఏ ఇతర జట్ల కన్నా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ లకు ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులుంటారు. ఇరు దేశాల అభిమానులు దీన్ని ఒక యుద్ధంగా భావిస్తారు. భారత్ -పాక్ మ్యాచ్ ల మధ్య మ్యాచ్ కు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. ఇరు దేశాల అభిమానులతో పాటుగా ఆటగాళ్లు కూడా ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోబోమని విరాట్ కోహ్లి అంటున్నాడు. ఈ మ్యాచ్ లో గెలవడానికే తాము అడుతున్నమన్నాడు. అటు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నామని భారత్ ను ఓడిస్తామంటూ ప్రకటించి హీట్ పెంచారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా భరత్ ఒకసారి గెలవగా పాకిస్థాన్ రెండు సార్లు నెగ్గింది. ప్రపంచ కప్ పై పాక్ పై భారత్ కు మెరుగైన రికార్డు ఉండగా ఛాంపియన్స్ ట్రోఫిలో మాత్రం పాక్ భారత్ ను రెండు సార్లు ఓడించింది. భారత్ -పాక్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.