ఉగ్రవాదమే అతిపెద్ద సవాలు:మోడీ

s20170603104209

ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్యల్లో తీవ్రవాదం ఒకటని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని ఆదేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తో భేటీ అయ్యారు. అగ్రనేతల భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయి. తీవ్రవాదాన్ని తుదముట్టిచడంలో ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా ముందుకు సాగాలని మోడీ అభిలషించారు. తీవ్రవాద సమస్య అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని ప్రధాని పేర్కొన్నారు. తీవ్రవాద సమస్యలను రూపుమాపేందుకు ప్రపంచదేశాలు ఒక్కతాటిపై నడవాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఫ్రాన్స్ తో బలమైన బంధాన్ని భారత్ కోరుకుంటోందని ప్రధాని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని ఇదే తరహాలో ఇక ముందు కూడా భారత్-ఫ్రాన్స్ ల మైత్రి బందం మరింత వికసించాలని ప్రధాని మోడీ అన్నారు.

భారత్-ఫ్రాన్స్ ల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపాడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యాపార, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు ఒకదానితో మరొకటి సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రాన్స్ లో మోడీ కోరారు. ఇరు దేశాల మైత్రి బంధం మరింతగా ధృడపడాలని కోరారు. ఐరోపా, ప్రపంచ రాజకీయ రంగంలో ఫ్రాన్స్ చూపిస్తున్న చొరవ, నాయకత్వ లక్షణాలను మోడీ ప్రశంసించారు. ఫ్రాన్స్ తో మరింత మైత్రిని భారతీయులు కోరుకుంటున్నారని అన్నారు.