దాడి ఘటనలో ఎమ్మెల్యే తీగల అనుచరుల అరెస్ట్

ఒక దుకాణంలో జరిగిన గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఈ ఘటనలో మహేశ్వరం ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక మోడల్ రైతు చికెక్ బజార్ లో జరిగిన వివాదం లో ఇంద్రసేన్ అనే వక్యిపై దాడి చేసిన ఎమ్మెల్యేతీగల కృష్ణారెడ్డి అనుచరులు రుషి, సలీమ్ లను పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ ఒత్తిడుల వల్ల పోలీసులు కేసను నమోదు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు కేసును నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి,  సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి ల అనుచరులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఎల్.బి.నగర్ లో హల్ చల్ చేశారు. స్థానికంగా  ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యాలయం వద్ద “మోడల్ రైతు చికెన్ బజార్”  ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ దుకాణంలో బియ్యాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి తీరా దాన్ని వాడి చూస్తే బియ్యం నాణ్యతపై అతనికి సందేహం వచ్చింది. దీనితో అతను దుకాణుదారుడిని నిలదీశాడు. మంచి బియ్యం పేరిట చైనా బియ్యాను అమ్ముతున్నారంటూ వాగ్వాదానికి దిగడంతో గొడవ ముదిరింది. ఈ సమయంలో వివాదంలో జోఖ్యం చేసున్న ఎమ్మెల్యే అనుచరులు రుషి, సలీమ్ లు సదరు వినియోగదారుడితో గొడవకు దిగారు. ఇరువురి మధ్య మాటా మాటా  పేరగడంతో అతనిపై ఎమ్మెల్యే అనుచరులు చేయిచేసుకున్నారు. దుకాణం దగ్గరి నుండి చాలా కొట్టుకుంటూ తీసుకుని పోయారని బాధితుడు ఇంద్రసేన్ ఆరోపిస్తున్నాడు. ఈ సమయంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. తనను తాను ఎమ్మెల్యేగా అనుచరుడిగా పరిచయం చేసుకున్న వ్యక్తి పోలీస్ వ్యాన్ సైతం బాధితుడిగా దాడిచేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కు వచ్చిన తరువాత కూడా ఎమ్మెల్యే అనుచరుడు దురుసుగా ప్రవర్తించాడని ప్రత్యాక్షసాక్షలు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లోనే ఏకంగా ఒక కానిస్టేబుల్ చొక్కా పట్టుకున్న దృశ్యాలు సీసీ కెమేరాల్లో కనిపిస్తున్నాయి.
బియ్యం నాణ్యతపై అడిగిన నేరానికి తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారని బాధితుడు  వాపోతున్నాడు. తనను రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్లారని అతను చెప్తున్నాడు. పోలీసులు వచ్చిన తరువాత కూడా వారి ముందే దాడిచేశాడని అంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *