రోడ్డును పడ్డ నర్సింగ్ విద్యార్థినులు

మెడ్విన్ హాస్పిటల్స్ యాజమాన్య నిర్వాకంతో నర్సింగ్ విద్యార్థినులు రోడ్డున పడ్డారు. మెడ్విన్ హాస్పిటల్స్ ను మూసేసిన సంస్థ యాజమాన్యం దానికి అనుబంధంగా నిర్వహిస్తున్న మెడ్విన్ నర్సింగ్ కళాశాలను, హాస్టల్ ను మూసేశారు. దీనితో ఈ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థునులు రోడ్డున పడ్డారు. వీరిలో అధికం శాతం కేరళకు చెందిన విద్యార్థినులు కావడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అఖస్మాత్తుగా హాస్టల్ మూసేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమకు ఇక్కడ బంధువులు ఎవరూ లేరని ఈ పరిస్థితుల్లో తాము ఎక్కడ ఉండాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా కళాశాలను,  హాస్టల్ ను మూసేశారని తమని రోడ్డుపై నిలబెట్టారంటూ వారు వాపోతున్నారు. తమ వద్ద ఫీజులు దండుకుని ఇప్పుడు రోడ్డుపైకి నెట్టడంతో తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. మెడ్విన్ యాజమాన్య తీరుకు నిరసగా నిరసనకు దిగిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు పై భైఠాయించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన వీరని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళన చేస్తున్న తమను మెడ్విన్ యాజమాన్యం బెదిరిస్తోందని విద్యార్థినులు చెప్తున్నారు. తాము విద్యాసంవత్సరాన్ని పోల్పోయామని తమ భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తమను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడ్విన్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ భాష తెలియక తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Photo Courtesy: Satya Rapelly