మహిళా మంత్రి నిర్వాకం-యోగికి తల నొప్పులు

ఓ మహిళా మంత్రి నిర్వాకం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. యూపిలో తనదైన శైలిలో పరిపాలనను పరుగులు పెట్టిస్తున్న యోగి రాష్ట్రవ్యాప్తంగా మద్య నిషేధాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. మధ్యం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని రాష్ట్రంలో మధ్యనిషేధం విదిస్తే ఏట్లా ఉంటుందనే దానిపై యోగి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ తరుణంలో యోగి క్యాబినెట్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏకంగా బార్ ను ప్రారంభించడం వివాదాన్ని రేపింది. ఓ వైపు ముఖ్యమంత్రి మధ్య నిషేధం పై మాట్లాడుతుండగా ఆయన క్యాబినెట్ సహచరురాలు అదీ స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి బార్ ను ప్రారంభించడం పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి స్వాతి సింగ్ బీర్ ది బార్ అనే బార్ ను ప్రారంభించడంపై విమక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో యోగికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి తనకు పూర్తి నివేదికను అందచేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అందివచ్చిన అవకాశాన్ని విపక్షాలు గట్టిగానే అందిపుచ్చుకున్నాయి. యోగి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ తీవ్రంగా విరుచుకుని పడుతున్నాయి. మంత్రి గారి నిర్వాకంతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని సమాజ్ వాదీ పార్టీ దుయ్యబట్టింది. సీఎం మధ్య నిషేధం అంటూ ప్రచారం చేస్తున్నారని అదే సమయంలో మహిళా  మంత్రి మాత్రం బార్ లను ప్రారంభిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.