ముగ్గురి ప్రాణాలు బలిగొన్న పుకార్లు

ఇదిగో పులి అంటే అదిగో తోక చందంగా షికారు చేసే పుకార్ల వల్ల ఝర్ఖండ్ రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.  తూర్పు సింగ్ భూమ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఘార్ఖండ్ లో గత కొద్ది రోజులుగా ఆదివాసీలకు చెందిన పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పుకార్లు దావానలంగా వ్యపించాయి. ఆదివాసీల పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ  పొరుగు గ్రామాలకు  వేలాది మంది నాగది గ్రామం ోలని ఓ ఇంటిపై దాడిచేసి వికాశ్ కుమార్ వర్మ, గౌతం కుమార్ వర్మ, గంగేశ్ గుప్తాలను ఇంటి నుండి బయటకు లాగి అత్యంత దారుణంగా హతమార్చారు.  అడ్డువచ్చిన వారి తల్లిని గాయపర్చారు. ఒక్కసారిగా దండెత్తిన వేలాది మంది వారి ముగ్గురుని బయటకు లాగి చంపేశారు. పోలీసుల ముందే ఈ దారుణం చోటు చేసుకుంది. పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసులు ఏమీ చేయలోకపోయారు. రాష్ట్రంలో ఎటువంటి కిడ్నాప్ ముఠాలు లేవని పోలీసులు చెప్తున్నారు.  చనిపోయిన వారికి పిల్లల అపహరణతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. పుకార్లు సృష్టించే వారిని పట్టుకుంటామని అంటున్నారు.

        కేవలం పుకార్ల కారణంగానే ఈ అనర్థం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. కొందరు పని గట్టుకుని పుకార్లను వ్యాపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  పశువులను అపరిస్తున్నారనే కారణంతో ముగ్గురురిని ఇటీవలే గ్రామస్థులు హత్య చేశారు. ఈ కేసులో కూడా హతులకు పశువుల అపరహణతో ఎటువంటి సంబంధం  లేదని తేలింది. ఈ ఘటనల నేపధ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.  ఈ  హత్యలకు నిరసనగా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. హత్యలకు పాల్పడింది, చనిపోయింది రెండు వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ఎక్స్ గ్రేషియా  చెల్లిస్తామని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని అన్నారు. పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న పుకార్లకు సామాజిక మాధ్యమాలు కూడా తోడవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *