వైమానిక దాడులకు సిద్దమైన భారత్…?

భారత్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తీవ్రవాదుల ఆటలు కట్టించేందుకు భారత్ వైమానికి దాడులకు సిద్ధమవుతోందా…? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. సరిహద్దులకు ఆవల ఉన్న తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు నిర్వహించి వాటిని ద్వంసం చేసిన భారత్ ప్రస్తుతం వైమానికి దాడులకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వైమానికి దాడులకు సంబంధించి ఇప్పటికే భారత వైమానిక దళానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎప్పుడైనా దాడులను నిర్వహించేందుకు వైమానికి దళం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సర్జికల్ దాడుల తరువాత కూడా సరిహద్దుల్లో తీవ్ర వాద కార్యకలాపాలు పూర్తిగా తగ్గలేదు. కొద్ది రోజుల పాటు కదలికలు తగ్గినట్టే తగ్గి తిరిగి ఊపందుకున్నాయి. పాకిస్థాన్ సైనికుల సహాయంతో తీవ్రవాదులు భారత్ లోకి చొరబడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో తీవ్రవాదులు భారత సైన్యాన్ని లక్ష్యాంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు. సైనికులను దొంగ దెబ్బతీస్తూ  ప్రాణనష్టం కలిగిస్తున్న తీవ్రవాదులపై కఠిన చర్యలకు భారత ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
సరిహద్దులకు సమీపంలో ఉన్న తీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున విరుచుకుని పడేందుకు వాయుసేన సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు భారత్ ఎయిర్ ఫోర్స్ ధళాధిపతి బీఎస్ ధనోవా ఎటువంటి పరిస్థితుల్లోనైనా శత్రవులపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఒక లేఖ రాశారు. విపత్కర పరిస్థితుల్లోనూ దాడులు జరిపేందుకు సిద్ధంకావలంటూ అందులో కోరారు. ఆపరేషన్ కు సిద్ధంగా ఉండాలంటూ ఆయన చేసిన సూచనలు భారత వైమానిక దాడుల సన్నద్దతను తెలియజేస్తోంది. భారత సరిహద్దుల్లోని నియంత్రణ రేఖను అనుకూని పెద్ద సంఖ్యలో తీవ్రవాదల స్థావరాలు, శిక్షణా శిభిరాలు ఉన్నాయి. ఇవన్నీ పాకిస్థాన్ సైనికుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. తీవ్రవాద శిక్షణా శిభిరాలు తమ భూబాగంలో లేవంటూ పాకిస్థాన్ బుకాయిస్తున్నా భారత్ ఇప్పటికే పలు సార్లు దీనికి సంబంధించిన సాక్షాలను పాకిస్థాన్ ముందర ఉంచింది. అయినప్పటికీ పాకిస్థాన్ తన పెడ బుద్దులను మార్చుకోవడం లేదు. ఈ తరుణంలో తీవ్రవాదులకు గట్టి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్న భారత్ వైమానికి దాడులకు సిద్ధపడుతోంది.
తమ భూభాగంలో భారత్ వైమానిక దాడులు జరిపితే పాకిస్థాన్ ఏవిధంగా స్పందించినా సరే దానికి సిద్ధంగా ఉండాలని భారత్ సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఒక వేళ పాకిస్థాన్ తెగబడి భారత్ పైకి దండెత్తినా దానిని సమర్థంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి తరచూ కాల్పులకు దిగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు తగిన బుద్ది చెప్పాలని ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు అందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *