ఎండలు మండుతాయ్- తూ.గోకు ఇస్రో హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో ఎంత తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఎండలు మండిపోతాయని 50 డిగ్రీల దాగా ఉష్ణోగ్రతలు చేరుకునే ఉవకాశం ఉన్నట్టు ఇస్రో హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ కార్తికేయ ఈ విషయాన్ని చెప్పారు. రాబోయే మూడు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఏండ తీవ్ర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని సూచించారు. ఇస్రో హెచ్చరికల నేపధ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలోని అమలాపురం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని సమాచారం అందినట్టు కలెక్టర్ వివరించారు. విటితో పాటుగా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న నాలుగు రోజుల పాట అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దని ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
కోనసీమ ప్రాంతం అంటేనే ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. పచ్చటి కొబ్బరి చెట్లు,  పిల్లకాలువలతో ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా నమోదవుతాయంటూ వస్తున్న హెచ్చరికలు స్థానికులను కలవర పెడుతున్నాయి. వేసవి సెలవల్లో ఇతర ప్రాంతాల నుండి  పెద్ద సంఖ్యలో కోనసీమకు వచ్చే వారు కూడా ఎండలకు భయపడి పోతున్నారు. ఈ తరహా హెచ్చరికలు గతంలో ఎన్నడూ లేవంటున్నారు. ఇంత ఎండ తీవ్రత ఉండడానికి కారణాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *