మాజీ విశ్వసుందరి, సినీ నటి ఐశ్వర్యరాయ్ ప్రఖ్యాత అంతర్జాతీయ సినీ ఉత్సవం కేన్స్ లో సందడి చేసింది. లోరియల్ ప్యాలెస్ బ్రాండ్ అంబాసిడర్ గా కేన్స్ రెడ్ కార్పెట్ పై మెరిశారు. మైఖెల్ సిన్కో డిజైన్ చేసి పౌడర్ బ్లూ వన్నె గౌనులో కనిపించిన ఐస్ అభిమానులను అలరించారు. ఐశ్వర్య లుక్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఐష్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. ఐష్ అందం ముందు డిస్నీ రాకుమారి కూడా చిన్నబోయిందంటూ ప్రశంశలు కురిపించారు. .కేన్స్ 70వ సినీ ఉత్సవం మే 17న ప్రారంభమైంది. ఐష్ కేన్స్‌లో పాల్గొనడం ఇది 16వ సారి. అంతకు ముందు కేన్స్ ఫొటోషూట్‌లో ఆకుపచ్చని డ్రెస్లోనూ ఐష్ కనువిందు చేసింది