కొండ చరియలు విరిగి చిక్కుకున్న 15వేల మంది

ఉత్తరాఖండ్ లో కొండ చరియలు మరోసారి భీబత్స సృష్టించాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరయం కలిగింది. విష్ణు ప్రయాగ-భద్రినాద్ మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 15 వేల మందికి పైగా యాత్రికులు ఈ మార్గంలో చిక్కుకున్నట్టు సమాచారం. గత రెండు మూడు  రోజులుగా ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడడంతో రోడ్డు మార్గానికి అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్లు పడినట్టు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు  రంగంలోకి దిగాయి. రోడ్ల పై పడ్డ రాళ్లను తొలగిస్తూ రాకపోకలను పునరుద్దరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
char dham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *