జాదవ్ ఉరిపై స్టే-ఐసీజేలో పాక్ కు ఎదురుదెబ్బ

పాకిస్థాన్ పై భారత్ సాగిస్తున్న న్యాయపోరాటంలో భారత్ విజయాన్ని సాధించింది. భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ మిలట్రీ కోర్టు విధించిన శిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. గూఢచర్యం ఆరోపణలపై కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన మరణ శిక్షపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన 11 మంది న్యాయమూర్తల ధర్మాసనం మరణశిక్షపై స్టేను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును విచారించేందుకు అంతర్జాతీయ  న్యాయస్థానికి హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొంది. వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యమార్గంలో జాదవ్‌ను కలుసుకునే హక్కు భారత్‌కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.  జాదవ్‌ను ఉరితీయబోమని పాకిస్థాన్‌ హామీ ఇవ్వాలని ఐసీజే కోరింది. జాదవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.  ఐసీజే తోసిపుచ్చింది. అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం వెలువరించిన తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. సరైన ఆధారాలు చూపకుండానే జాదవ్ కు మరణ శిక్ష విధించారంటూ భారత్ చేసిన వాదనను అంతర్జాతీయ కోర్టు అంగీకరించింది. 46ఏళ్ల జాదవ్‌ను పాకిస్థాన్ గతేడాది మార్చి 3న అరెస్టు చేసింది. పాకిస్థాన్ లో గూడచర్యం నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తూ అతన్ని పాక్ మిలటరీ కోర్టులో హాజరపర్చగా మిలటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. జాదవ్ ను కలుసుకునేందుకు భారత్ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. భారత్ నుండి వచ్చిన ప్రతినిధులను పాకిస్థాన్ జాదవ్ ను కలవనీయలేదు. అంతర్జాతీయ న్యాయసూత్రలకు విరుద్దంగా ఏకపక్షంగా జాదవ్ కు మరణ శిక్ష విధించడం పై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దౌత్య మార్గాలు మూసుకుని పోవడంతో అందర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది.  భారత్‌ తరఫున  విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్‌ మిత్తల్‌, న్యాయవాది హరీశ్‌ సాల్వే  వాదనలు వినిపించారు.  గూఢచారులకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవంటూ పాక్‌ చేసిన వాదనను కోర్టు కొట్టివేసింది. ఐసీజే తీర్పుతో జాదవ్‌ కుటుంబం, దేశ ప్రజలకు వూరట లభించిందనివిదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *