బట్టల దుకాణంలో రు.45కోట్ల పాత నోట్లు

     చెన్నైలోని ఒక బట్టల దుకాణంలో 45కోట్ల రూపాయల విలువైన రద్దయిన పాత నోట్లు లభించాయి. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసలకు పెద్ద మొత్తంలో పాత 500, 1000 రూపాయల నోట్లు లభించాయి. బట్టల దుకాణంలో పాత నోట్లు ఉన్నట్టుగా పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు తనిఖీలు చేయగా పాత నోట్ల కట్టలు  లభించాయి. దీనితో మరికొంత తనిఖీలు చేయగా కట్టలకు కట్టలు పాత ఐదు వదంల, వేయు రూపాయల నోట్లు దొరికాయి. వాటని లెక్కించగా 45 కోట్ల రూపాయలు  ఉన్నట్టు తేలింది.  కదంబక్కమ్ ప్రాంతంలో ఉన్న ఓ సాధారణ బట్టల దుకాణంలో ఇంత పెద్ద మొత్తంలో నోట్లు దొరకడం పై పోలీసులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు. నోట్ల కట్టలు లభించడానికి  సంబంధించి కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే లభించన నోట్లు  తనవి కావని ఓ నగల వ్యాపారి వీటిని దాచమని తనకు ఇచ్చాడని బట్టల దుకాణం యజమాని పోలీసులకు చెప్పాడు. దీనితో నగల వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు అసలు ఈ నోట్లు ఎవరికి బట్టల దుకాణంలోకి ఏ విధంగా వచ్చాయనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *