త్వరలో భారీగా బీజేపీలోకి వలసలు

బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఉత్సాహం చూపెడుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు అన్నారు. అయితే ఎవరెవరను తమ పార్టీలోకి వచ్చేది ఇప్పుడే చెప్ప బోమని అన్నారు. కొంత మంది కీలక నేతలు ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతన్నట్టు ఆయన వెల్లడించారు. భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరబోతున్నట్టుగా వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ వివిధ పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు తమను సంప్రదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీలో చేరేందుకు ఏ స్థాయిలో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ అన్ని స్థాయిలకు చెందిన నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. త్వరలోనే బీజేపీలో చేరబోయే నేతల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మోడీ విధానాల పట్ల ఆకర్షితులై పెద్ద సంఖ్యలో తమ పార్టీ వైపు నేతలు వస్తున్నారని అన్నారు. మోడీ దేశాన్ని సమర్థ దిశలో నడిపిస్తున్నారని చెప్పారు. భారత దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ది పథంలోకి దూసుకుని పోతోందన్నారు. అవినీతి లేని భారత్ ను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించారన్నారు.
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *