తలాక్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

0
50

ట్రిపుల్ తలాక్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ముస్లీంలలో ఉన్న ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని అడ్డుపెట్టుకుని కొంత మంది అడ్డగోలుగా బార్యలకు విడాకులు  ఇస్తూ వాళ్ల జీవితాలతో ఆడుకోవడాన్ని అడ్డుకోవాలంటూ కొంత మంది మహిళలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. అంత్యంత ప్రాధాన్యం ఉన్న కేసుగా దీన్ని గుర్తించిన సుప్రీం కోర్టు వేసవి సెలవులను రద్దు చేసుకుని మరీ విచారణ జరుపుతోంది. ఐదుగురు జడ్జీలతో కూడిన  రాజ్యంగా  ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తలాక్ పై అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్ విధానం అనుచితం, అవాంఛనీయం అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. ట్రిపుల్ తలాక్ విధానం సరైంది కానప్పటికీ ిిఇస్లాం ప్రకారం ఇది చట్ట బద్దమేనని సుప్రీం కోర్టు పేర్కొంది.
ట్రిపుల్ తలాక్ పై ఆరురోజుల పాటు విచారణ సాగనుంది. ముల్సీం పర్సనల్ లా బోర్డు లాంటి సంస్థలు ట్రిపుల్ తలాక్ ను సమర్థిస్తుండగా మరికొందరు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ట్రిపుల్ తలాక్ కు సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న చారిత్రాత్మక విచారణలో ఇరు  వర్గాలు తమ వాదనలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాద రాజ్ జఠ్మలాని వాదిస్తూ ట్రిపుల్ తలాక్ మహిళల హక్కులకు భంగకరమని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు ఉండాల్సిన హక్కులు లేవని ఇది రాజ్యాంగ విరుద్దమని వాదించారు.
ట్రిపుల్ తలాక్ పద్దతి ముస్లీంలలో అనాదిగా వస్తోంది. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా ముస్లీం పురుషులు  భార్య నుండి విడాకులు  తీసుకోవచ్చు. దీని వల్ల అనేక మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఈ విధాన్ని అడ్డుకోవాలని ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించే వారు కోర్టును ఆశ్రయించార. వాట్సప్ లో, ఫేస్ బుక్ లో సందేశాలు పంపి కూడా విడాకులు ఇచ్చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో ఈ విధాన్ని వెంటనే ఆపాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here