భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల హోరు

భారత్-పాక్ సరిహద్దులు కాల్పుల మోతతో హోరెత్తిపోతున్నాయి. రెండు వైపుల నుండి భారీ స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాకిస్థాన్ భారత్ జవాన్లను, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించింది. బుధవారం రాత్రి ప్రారంభమైన కాల్పులు ఉదయానికి మరింత తీవ్రం అయ్యాయి. తుపాకులతో పాటుగా మోర్టర్లతో పాక్ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. సాధరణంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు వీలుగా భారత సైనికుల దృష్టిన్ని మళ్లించేందుకు పాకిస్థాన్ ప్రతీసారి కాల్పులకు తెగబడుతూనే ఉంటుంది. ఈసారి భారీ ఎత్తున కాల్పులకు దిగడంతో భారత్ కూడా ధీటుగానే జవాబు చెప్పింది. భారత దళాలు కూడా భారిగా ఎదురు కాల్పులకు దిగాయి. పాక్ బంకర్లను లక్షంగా చేసుకుని భారత సైనికులు కాల్పులు జరిపారు. ఇరువైపుల నుండి పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతుండడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది.
ఇటీవల కాలంలో సరిహద్దుల్లో పాక్ దళాలు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఒక్కసారిగా భారత పోస్టులపైకి కాల్పులు జరుపుతూ భీబత్సం సృష్టుస్తున్నారు. ఇద్దరు భారతీయ సైనికులను అత్యంత పాశవికంగా హత్యచేసిన పాకిస్థాన్ భారత బలగాలే తమ పౌరవాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ప్రస్తుతం పాక్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగానే బదులు చెప్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *