ట్రిపుల్ తలాక్ పై సుప్రీం విచారణ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ‘తలాక్’ అంటూ మూడు సార్లు చెప్పడం ద్వారా ముస్లీంలు విడాకులు తీసుకోవడం అత్యంత అమానుషమంటూ కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫేస్ బుక్, వాట్సప్ లలోనూ తలాక్ అంటూ మెసేజ్ లు ఇచ్చి విడాకులు తీసుకుంటున్న వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ట్రిపుల్ తలాక్ వ్యవహారం అత్యంత అనాగరికమని, మహిళల హక్కులకు పూర్తిగా కాలరాచేవిగా ఉన్నాయంటూ పలువురు ధ్వజమెత్తుతున్నారు. అటు ముస్లీం సంస్థలు మాత్రం ఈ చర్యను సర్థించుకుంటున్నాయి. అనాధిగా ముస్లీంలలో ఉన్న ఆచారాన్ని తప్పు పట్టడం సమంజసం కాదనేది వారి వాదన. అటు ముస్లీం పర్సనల్ లా బోర్డు కూడా ట్రిపుల తలాప్ ను సమర్థిస్తోంది. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ పై విచారణ జరుపుతోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖెహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులోని ఐదుగురు న్యాయమూర్తులు ఐదు మతాలకు చెందిన వారు కావడం విశేషం. సీజే జస్టిస్‌ ఖెహర్‌(సిక్కు), జస్టిస్‌ కె. జోసఫ్‌(క్రిస్టియన్‌) జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌ నారీమన్‌ (పార్సీ), జస్టిస్‌ యు.యు.లలిత్‌(హిందూ), అబ్దుల్‌ నాజీర్‌(ముస్లిం)లు ఈ కేసును విచారిస్తున్నారు. విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు కొన్ని కీల వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లాం మతానికి సంబంధించిన ప్రాథమిక అంశమా కాదా అనే విషయాన్ని మాత్రమే తాము విచారిస్తుమని స్పష్టం చేసింది. ఇస్లాం మూలసుత్రాల్లో ట్రిపుల్ తలాక్ కు సంబంధించిన అంశాలను గురించి విచారణ జరుపుతున్నట్టు సప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముస్లీంలు ఆచరించే బహుబార్యత్వంపై తాము విచారణ జరపడం లేదని అత్యన్నత న్యాయస్థానం పేర్కొంది. సుప్రీం కోర్టు విచారణపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *