మండు వేసవిలో చల్లటి గాలులు

0
71

 
మండు వేసవిలో విజయవాడ వాసులు చల్లని గాలులతో ఉబ్బితబ్బిబవుతున్నారు. విజయవాడతో పాటుగా దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న జనం చల్లటి వాతావరణాన్ని ఏంజాయ్ చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజున ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో విజయవాడ వాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడతో పాటుగా కృష్ణ జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. మచిలీ పట్నంలో ఉదయం నుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. పెడన, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు పడపోవడంతో రహదారుదలపై వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
కృష్ణా జిల్లాతో పాటుగా తెలంగాణలోని కొన్ని చోట్ల కూడా ఆకాశం మేఘావృత్తమై ఉంది. ఖమ్మం లోని కొన్ని ప్రాంతాల్లో తెలికపాటి వర్షం కురిసింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here