వాళ్లకి ఉరి సరికాదు:మంచు లక్ష్మి

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని సినీ నటి మంచు లక్ష్మి స్పష్టం చేశారు. రానున్న ఎన్నిక్లలో మంచు లక్ష్మి పోటీచేయనున్నారంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు ఎంత మాత్రం లేదని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటు వచ్చిన వార్తలు అన్నీ నిరాధారమైనవిగా మంచు లక్ష్మి పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకున్నా తాను సమాజ సేవలో ముందుంటానని చెప్పారు. సమాజ హితం కోసం తాను కార్యక్రమాలను చేపడతానని అయితే రాజకీయాల్లోకి మాత్రం వచ్చేది లేదన్నారు. సమాజ సేవ చేయడంలో తనకు ఆనందం లభిస్తుందని మంచు చెప్పారు.
నిర్భయ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్ష విధించడం పై స్పందించిన మంచు లక్ష్మి వారికి ఉరిశిక్ష విధించడం సరైంది కాన్నారు. ఉరిశిక్ష విధించడం వల్ల లాభం లేదని వారికి మహిళల విలువ గురించి అర్థం అయ్యేలా చెప్పాలన్నారు. తాము చేసిన తప్పును తెలుసుకునే అవకాశం వారికి ఇవ్వాలని మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. ఉరిశిక్షలు విధించినంత మాత్రనా ఇటువంటి తరహా ఘటనలు తగ్గిపోతాయని చెప్పలేమని ఆమె పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరిని చిన్ననాటి నుండే మహిళల పట్ల మెలగాల్సిన తీరును గురించి చెప్పాలన్నారు. స్త్రీల విలువను గురించి చిన్నతనం నుండే చెప్పాలని ఇందుకు పాఠశాలలు, ఇళ్లు వేదికకావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *