అమర జవాను కుమారైను దత్తత తీసుకుంటాం

పాకిస్థాన్ అత్యంత దారుణంగా హతమార్చిన బీఎస్ఎఫ్ జవాను సుబేదార్ పరంజీత్ సింగ్ సుమారైను దత్తత తీసుకుంటామంటూ ఒక ఐఏఎస్ దంపతులు ముందుకు వచ్చారు. అమర జవాను కుమారైను దత్తతు తీసుకుని చదివిస్తామని ఆమె పెళ్లి బాధ్యతలు కూడా తీసుకుంటామంటూ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ దంపతులు ముందుకువచ్చారు. ప్రస్తుతం కులు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న యూనస్ ఖాన్, ఆయన సతీమణి ఐపీఎస్ అధికారిణి అంజుమ్ ఆరాలు అమర జవాను కుమారై కుష్దీప్ ను  దత్తత తీసుకుంటామని చెప్పారు.
దేశం కోసం అమరుడైన జవాను కుటుంబాన్ని ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి దత్తత కోసం ముందుకు వచ్చామని వారు చెప్పారు. ఆ చిన్నారి తాను కోరుకున్న చోట చదివిస్తామని ఆమె ప్రస్తుతం చదువుకుంటున్న స్కూల్ లో చదువకుంటానంటే అక్కడే చదివిస్తామని లేదా మరో స్కూల్ లో చేర్పించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జవాను కుమారై ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉండవచ్చని తమ వద్దకు వచ్చినా జాగ్రత్తగా చూసుకుంటాని చెప్పారు. లేదా తన కుటుంబంతో పాటుగా ఉన్నా ఆమెకు కావాల్సిన వసతులన్నింటినీ తాము సమకూరుస్తామని ఈ దంపతులు తెలిపారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాను కుమారై కుష్దీప్ ను ఉన్నత స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తాము చేయగలిగినంతా చేస్తామని చెప్పారు. జవాను ఈ దేశం కోసం చేసిన త్యాగం తో పోలిస్తే తాము చేస్తామన్నది చాలా చిన్న సాయమని వారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *