నిర్భయ దోషులకు ఉరి ఖరారు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు నిందితులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. నిర్భయ మరణ వాం‍గ్ములాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ దారుణ ఘనను నేరపూరిత కుట్రగా ధ్రువీకరించింది. అత్యంత అమానుషంగా అమానవీయంగా వ్యవహరించిన దోషులకు ఉరి శిక్షను విధించడం సరైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమర్పించిన సాక్షాలు చాలని, దోషులు అత్యంత క్రూరంగా వ్యవహరించారడానికి సరైన సాక్షాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయ పడింది. భవిష్యత్తులు ఇటువంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు  గాను వీరికి మరణ శిక్ష విధిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
దేశరాజధాని ఢిల్లీలో ఐదు సంవత్సరాల క్రితం  కదులుతున్న బస్సులో 25 సంవత్సరాలు యువతిపై  అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు చేపట్టారు. మృత్యువుతోపోరాడిని నిర్భయ ను ప్రభుత్వం సింగపూర్ కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే ఆమె తుది శ్వాస విడిచారు. ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా విచారణ జరిపిన అత్యన్నత న్యాయస్థానం ఉరిశిక్షను ఖరారు చేసింది.తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి  మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టకేలకు మాకు న్యాయం జరిగిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *