సౌదీ మహిళలకు తీపి కబురు

మహిళలపై ఆంక్షల విషయంలో సౌదీ అరేబియా ముందువరుసలో ఉంటుంది. మగవారి తోడు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తిరగకూడదు, అక్కడ వారికి వాహనాలు నడిపే అవకాశం లేదు. బుర్ ఖా వేసుకోకుండా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో కనబడకూడదు. ఇట్లాంటి నిబంధనలు సౌదీలో చాలానే ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటిని అక్కడి రాజరిక ప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. ఇప్పటివరకు మహిళలు ఉద్యోగాలు చేయడం పై ఉన్న కొన్ని నిబంధనలు తాజాగా సౌదీ రాజు తొలగించి సంచలనం సృష్టించారు. తల్లిదండ్రులు, భర్తా లేదా సంరక్షులు అనుమతి లేకుండా మహిళలు ఉద్యోగం చేయడం సౌదీ ఇప్పటి వరకు నేరంగా పరిగణించేవారు. దీనికి తోడు అనేక ఆంక్షల ఫలితంగా మహిళా ఉద్యోగుల సంఖ్య అటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో చాలా తక్కువ.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలని సౌదీ రాజు నిర్ణయించారు. దీని ప్రకారం ఇప్పటివరకు నిబంధనల్లో మార్పులు తెచ్చారు. తల్లి దండ్రులు లేదా సంరక్షకుల అనుమతి లేకుండానే మహిళలు ఉద్యోగాలు  చేయవచ్చని ప్రకటించారు. దీనితో  పాటుగా ప్రభుత్వ ,  ప్రైవేటు కార్యాలయాలు మహిళలను స్వేచ్చగా నియమించుకోవచ్చని ప్రకటించడం ద్వారా వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ఒక్కసారిగా తుడిచిపెట్టారు. ఈ నిర్ణయంతో సౌదీలో మహిళా ఉద్యోగాలు సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ సంస్థలే రవాణా సౌకర్యం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. మహిళలు వాహనాలు నడిపే అవకాశం  లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమకు కూడా వాహనాలు నడిపడానికి అనుమతి ఇవ్వాలని చాలా కాలంగా సౌదీ మహిళలను కోరుతున్నా వారి కోరిక మాత్రం ఇంకా తీరలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *