మన్మోహన్ కన్నా మోడీ వెనుకబడ్డారు

     భారత మాజీ ప్రధానీ మన్మోహన్ సింగ్ కంటే ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన విషయంలో వెనుకబడే ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రధాని విదేశీ పర్యటన విషయంలో విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే మోడీ తక్కువ పర్యటనలే చేశారని అమిత్ షా వెల్లడించారు. కావాలనుకుంటే విపక్షాలు రికార్డులను పరిశీలించుకోవచ్చని షా పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలు చేసినప్పటికీ వాటిని ఎవరూ గుర్తించలేదని మోడీ విదేశీ పర్యటనల గురించి విస్తృతంగా ప్రచారం లభిస్తుండడంతో ఆయన పర్యటనల గురించి తెలుస్తున్నాయని అమిత్ షా చమత్కరించారు. మన్మోహన్ సింగ్ విదేశాలకు వెళ్లిందీ వచ్చిందీ ఎవరికీ తెలిసేదికాదని అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటూ అప్పుడప్పుడూ భారత్ కు వచ్చి వెళ్తుంటారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు షా తిప్పికొట్టారు. వాటిని అర్థంలేని విమర్శలుగా అమిత్ షా పేర్కొన్నారు. గతంలోనూ ప్రధానులు విదేశాల్లో పర్యటించినా మోడీకి ఆయా దేశాల్లో ప్రజల నుండి వస్తున్న ఆదరణలో కొంత కూడా ఇతర ప్రధానులకు రాలేదన్నారు. దీని వల్లే వారు విదేశాలకు వెళ్లివచ్చినా ఎవరికీ తెలిసేదికాదన్నారు. ప్రధానికి భారత్ తో పాటుగా విదేశాల్లో కూడా ప్రజలు  బ్రహ్మరథం పడుతున్నారని అమిత్ షా  పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *