సింధూకి ఇంటిస్థలం కేటాయింపు

     ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయి గజాల స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన భూమికి సంబంధించిన పత్రాలను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి  కేసీఆర్ సింధుకు అందజేశారు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన సింధూకు వేయి గజాల ఇంటిస్థలాన్ని అందచేయనున్నట్టు ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ దానికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. రియో ఒలింపిక్స్ లో పీపీ సింధు బ్యాట్మింటన్ విభాగంలో రజత పతాకాన్ని సాధించారు.