దావూద్ ఇబ్రహీం చనిపోయాడా….?

0
65

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఈ వార్తలను ఎవరు దృవీకరించడంలేదు. దావుద్ చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం  లేదని  దావుద్ సన్నిహితుడు చోటా షకీల్ చెప్తున్నాడు. పాకిస్థాన్ లో ఆశ్రయం  పొందుతున్న ముంబాయి పేలుళ్ల నిందితుడు, మాఫియా నేత దావుద్ ఇబ్రహీం కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. బ్రెయిన్ ట్యూమర్ ను తొలగించేందుకు చేసిన ఆపరేషన్ విఫలం కావడంతో దావుడ్ ఎడమవైపు భాగం పూర్తిగా చచ్చుబడిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వచ్చిన తీవ్ర గుండెపోటుతో దావుద్ మరణించినట్టుగా పాకిస్థాన్ మీడియా కథనం. అయితే ఈ వార్తలను అటు దావుద్ అనుచరులు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ దృవీకరించడం లేదు. దావుద్ అసలు తమ దేశంలోనే లేడని వాదిస్తున్న పాకిస్థాన్ దావుద్ మరణ వార్తపై స్పందించడం లేదు. మాఫియా డాన్ మరణ వార్తపై నిజానిజాలు తెలుసుకునే క్రమంలో భారత నిఘా వర్గాలు  సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. భారత్ ఏంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ  నేరగాడు పాకిస్థాన్ లోని కరాచీ నగరంలోకెల్లా అత్యంత ధనిక ప్రాంతమైన క్లిఫ్టన్ ప్రాంతంలో ఉంటున్నాడు. పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు మాత్రం దావుద్ తమ దేశంలో లేడని బుకాయిస్తూనే ఉంది.
దావుద్ ఇబ్రహీం మరణించాడంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని మాఫియా  డాన్ అనుచరులు, కుటుంబ వర్గాలు చెప్తున్నాయి. దావుద్ పూర్తిగా ఆరోగ్యంతోనే ఉన్నాడని ఇటీవల అతడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్, దావుద్ వియ్యంకుడు జావెద్ మియాందాద్ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమంలోనూ పాల్గొన్నాడని ఆ వర్గాలు చెప్తున్నాయి. దావుద్ సమీప బంధువు ఒకరు ఆస్పత్రిలో ఉండడంతో ఆయన్ను చూడడానికి ఆస్పత్రికి వెళ్లాడని దాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పాక్ మీడియాలోని కొన్ని వర్గాలు మాత్రం దావుద్ చనిపోయడని ఖచ్చితంగా చెప్తున్నాయి.
దావుద్ మరణవార్తపై నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దావుద్ ఇబ్రహీం నిజంగా మరణించాడా లేకుంటే ఒక పథకం ప్రకారం ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. పాకిస్థాన్ లో దావుద్ ఉన్న విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం తమ దేశంలో దావుద్ లేడంటూ కొట్టిపారేస్తోందని వారు పేర్కొన్నారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here