బాహుబలి-2 లీక్

బాహుబలి -2 పైరసీ బారిన పడింది. భారీ సినిమాలు పైరసీ బారిన పడకుండా నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి ప్రతీ చిత్రానికి ఈ బెడద తప్పడం లేదు. తాజాగా బాహుబలి కూడా పైరసీ బారిన పడింది. కువైట్ కు చెందిన ఓ వ్యక్తి బాహుబలి చిత్రాన్ని లీక్ చేశాడు. దాన్ని అతను ఫేస్ బుక్ లో ఉంచాడు. దీనితో నిర్మాతలు ఖంగుతిన్నారు. దీన్ని గుర్తించి వారు నివారణ చర్యలు తీసుకునే లోపే చాలా మంది చూడడం జరిగిపోయింది. గంట నిడివి ఉన్న చిత్రాన్ని కువైట్ నుండి ఫేస్ బుక్ లో ఉంచినట్టు గుర్తించారు.
బాహుబలి-2 యూఏఈలో ఒక రోజు ముందుగానే విడుదల అయింది. అక్కడ ఆ చిత్రాన్ని చూసిన వారు దాన్ని ఫేస్ బుక్ లో ఉంచారు. దీన్ని ఒక్క రోజులోనే 2.5 లక్షల మంది చూశారు. గతంలో కూడా దుబాయ్, కువైట్ ల నుండి అనేక చిత్రాలు పరైసీకి గురయ్యాయి. ఇక్కడి నుండే దంగల్ , సింగం  లాంటి సినిమాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష్యం అయ్యాయి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *