టీఆర్ఎస్ పతనం ప్రారంభం:ఉత్తం

0
41

టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం విధానాలపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని దాని నుండి తప్పించుకునేందుకే కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ పై విమర్శలు చేశారని చెప్పారు. మూడు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతు సమస్యలపై సీఎం ముసలి కన్నీర కారుస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. రైతుల సంక్షేమం పై నిజంగానే సీఎంకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తరువాత మూడవేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారు కాదన్నారు. రైతులకు ఎరువుల కోసం ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పడం ఎన్నికల జిమ్మిక్ గా ఉత్తమ్ అభివర్ణించారు. వచ్చే సంవత్సరం దాకా ఎందుకు వెంటనే రైతులకు సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గులాబీ కూలీ పేరుతో ఒక్క గంటలోనే టీఆర్ఎస్ నేతల లక్షలకు లక్షలు సంపాదించారని ఐస్ క్రీంలు, చీరలు అమ్మే బదులు మిర్చీ , పసుపు అమ్మి ఉంటే రైతులకు మేలు జరిగేదన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులు నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్ సభలో మాట్లాడకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి విద్యార్థులను కేసీఆర్ ఎంతగా వంచించారనే విషయం బయటపడుతుందన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. విడతల వారీగా కాకుండా ఏక కాలంలో పంట  రుణాల మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో వారికి నిరుద్యోగ బృతిని అందచేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు విసుగు చెందారని ఇక రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు ఉత్తమ్.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here