"యోగి"లా మారండి-యూపీ స్కూల్ హుకూం

0
50

ఉత్తర్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి మానియా ఎక్కువయింది. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది చేస్తున్న ప్రస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా యూపీ రాజధాని లక్నోలోని ఒక ప్రముఖ పాఠశాల నిర్వాకం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. దీనితో ఆ పాఠాశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లక్నోలోని రిషబ్ అకాడమీ పాఠశాల యాజమాన్యం విధించిన కొత్త నిబంధనతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు విస్తుబోయారు. పాఠశాలలోని విద్యార్థులంతా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదితయానాథ్ యోగి తరహాలో హెయిర్ కట్ చేయించుకోవాలని లేకుండా పాఠశాలలకు అనుమతించేది లేదని ప్రకటించడంతో విద్యార్థులు ఖంగు తిన్నారు. సన్యాసి జీవితం గడిపే యోగి నిత్యం గుండుతో కనిపిస్తారు. ఆయనలాగా కనిపించాలంటే గుండు కొట్టించుకోవడమే.. ఈ ఆదేశాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
ఇప్పటికే పాఠశాలకు మాంసాహారాన్ని తేవద్దంటూ హుకూం జారీచేసిన పాఠశాల యాజమాన్యం తాజాగా హెయిర్ కట్ విషయంలో తీసుకుని వచ్చిన నిబంధనతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్థిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే తాము యోగి లాంటి హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పలేదని పాఠశాల యాజమాన్యం అంటోంది. సరైన హెయిర్ కట్ తో రావాలని మాత్రమే సూచించామని చెప్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here