రెస్టారెంట్ల తనిఖీల్లో జీహెచ్ఎంసీ పనితీరు భేష్

హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్ల వంటశాలలను పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తూ అపరిశుభ్రవాతావరణంలో వంటలు చేస్తున్న రెస్టారెంట్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న జీహెచ్ ఎంసీకి పార్లమెంటరీ స్థాయి సంఘం నుండి ప్రశంసలు దక్కాయి. జీహెచ్ ఎంసీ చర్యల పట్ల  ఇప్పటికే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండుగా పార్లమెంటరీ బృందం కూడా సంతోషం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెస్టారెంట్ల పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని,  ఇదే తరహా చర్యలు కొనసాగించాలని బృందం జీహెచ్ఎంసీకి సూచించింది. నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పూర్తి అపరిశుభ్రవాతావరణం నెలకొనడంతో పాటుగా కొన్ని సార్లు పాచిపోయిన, నిల్వఉంచిన ఆహార పదరార్థలను వినియోగదారులకు వడ్డిస్తున్నారని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించింది. అనేక ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లకు నోటీసులు అందచేయడంతో పాటుగా కొన్నింటికి భారీగా జరిమానా విధించగా కొన్నింటిని మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
నగరంలోని అనేక రెస్టారెంట్లు, హోటళ్లు సరైన ప్రమాణాలు పాటించని సంగతి జీహెచ్ఎంసీ తనిఖీల్లో వెల్లడయింది. ముఖ్యంగా మాసం  విషయంలో అసలు ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. కేవలం అనుమతి పొందిన కబేళాల నుండి మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఎక్కడపడితే అక్కడి నుండి మాంసాన్ని కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. వంట పదార్థాల వాడకంలోనూ వచ్చిన ఫిర్యాదులపై దృష్టిపెట్టిన అధికారులు నాసిరకం వస్తువులను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలకు దిగింది. ఈ విషయంలో ఎన్ని వత్తిడులు వచ్చినా వాటిని ఖాతరు చేయకుండా పనిచేసిన అధికారులను పార్లమెంటరీ స్థాయి సంఘం అభినందించింది.
జీహెచ్ఎంసీ అధికారులు వేధిస్తున్నారంటూ రెస్టారెంట్లు,  హోటళ్ల యజమానులు చేస్తున్న ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని ఆ శాఖ ఉన్నతాదికారులు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు వ్యవపారం చేసుకునే వారి జోలికి తాము వెల్లడం లేదని నిబంధంనలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వారంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిబడిన అంశం అయినందున ఇందులో ఎటువంటి రాజీ లేదని చెప్పారు. రెస్టారెంట్లు, హోటళ్లతో పాటుగా ఇతర తినుబండారాలు విక్రయించే వారు కూడా వాటి తయారీలో శుభ్రత పాటించాలని వారు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *