తెలంగాణ బిడ్డ… నీదే ఈ బంగారు గడ్డ…

0
46

రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి మొహంలోనూ చిరునవ్వులు చిందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ ‘ప్రగతి నివేదన’ సభకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ది ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి 10వేల ట్రాక్టర్లతో సభకు తరలివచ్చిన రైతులందరికీ పాదవివందనం చేస్తున్నట్టు చెప్పార. ఎండకు భయపడకుండా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించడం లేదని అందరి అభివృద్ది కోసం పాటుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఒక్కో సమస్యను అధికమిస్తూ వస్తున్నామని చెప్పారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని దీని వల్ల ప్రజలకు పాలన చేరువైందన్నారు. జిల్లాల విభజన వల్ల ప్రజలు లాభపడ్డారని పాలన సులువైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందన్న వారి అంచానాలను తలకిందులు చేస్తూ కరెంటు సమస్యను అధికమించాన్నారు. కరెంటు సమస్య తీరడంతో రైతులు ఆనందంతో ఉన్నారని పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తునాయని చెప్పారు.
ప్రతీ ఇంటికి మంచినీరు అందించే బృహత్ కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.  ఈ మిషన్ భగీరథ పథకం  కింద ప్రతీ ఇంటికి మంచినీరు అందచేసే కార్యక్రం చురుగ్గా సాగుతోందన్నారు. ఇందుకోసం గాను 43 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు కేసీఆర్  వివరించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని ఇందుకోసం  గాను గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. రు.40వేల కోట్ల తో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని అన్ని కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కుల వృత్తులపై ఆధారపడిజీవిస్తున్నవారు ఆర్థికంగా పరిపుష్టం అయే దిశలో ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఎటువంటి పైరవీలకు చోటులేదని కేవలం అర్హులైన వారికే ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది చేకూరుతుందన్నారు. అందరం కష్టపడి చేస్తే బంగారు తెలంగాణ మరెంతో దూరంలో లేదన్నారు. అంతకు ముందు ప్రసంగించిన పలువురు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పార. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవడం ఖాయమన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here