బాహుబలి బ్లాక్ దందా…

బాహుబలి చిత్రం టికెట్ల విషయంలో భారీ దుమారం రేగుతోంది. ఛారిటీ షోలు, ప్రిమియర్ షోల పేరుతో భారీ ఎత్తున బాహుబలి టికెట్లను ఇప్పటికే పలు చోట్ల విక్రయించగా అటువంటి షోలకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ను శుక్రవారంగా పేర్కొన్నందున అదే రోజు రిలీజ్ చేయాలని ప్రత్యేక షోలకు ఇప్పటివరకు తమ వద్ద అనుమతి తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీనితో ఈ షోల నిర్వహణపై ఇప్పుడు అనుమానాలు రేకెత్తున్నాయి. మరో వైపు బాహుబలి టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బాహుబలి టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారని స్వయంగా డిస్టిబ్యూటర్లు, ధియేటర్ల యజమానులు కలిసి టికెట్లను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాహుబలి చిత్రానికి సంబంధించిన టికెట్లు ఆన్ లైన్ లో పెడుతున్నట్టు ధియేటర్ల యాజమాన్యాలు చెప్తున్నాయి. అయితే ఆన్ లైన్ లో ఎక్కడా టికెట్లు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. ఒక దర్శకుడు వివిధ షోలకు సంబంధించిన దాదాపు 15వేల టికెట్లను తన వద్ద పెట్టుకున్నాడని, మరో దర్శకుడు 13 వేల టికెట్లను పెట్టుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. కాంబో ఆఫర్ అంటూ టికెట్ల రేట్లను ఇష్టాను సారం పెంచేస్తున్నారని జనం వాపోతున్నారు. అయితే టికెట్ల రేట్లను పెంచే అధికారం ధియేటర్ యాజమాన్యాలకు దేని ప్రభుత్వం చెప్తున్నా టికెట్ల ధరలు మాత్రం పెంచేశాయి. ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *