సాహోరే…బాహుబలి   

బాహుబలి… ప్రస్తుతం ఎవరి నోటి వెంట విన్నా ఇదే చర్చ… ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి శుక్రవారం నాడు విడుదలవుతోంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ,కన్నడ భాషాల్లో బాహుబలి చిత్రం విడుదల అవుతోంది. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే బాహుబలి ఒక సంచలనం ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూసినట్టుగా మరే చిత్రం కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడలేదండే అతిశయోక్తిలేదు. బాహుబలి చిత్రం టికెట్ల కోసం చాంతాడంత క్యూలు దర్శనమిచ్చాయి. ప్రీ బుకింగ్ కోసం జనం బారులుతీరారు. ఆన్ లైన్ లో ఇప్పటికే అన్ని టికేట్లు అమ్ముడు అయిపోయాయి. ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేసిన క్షణాల్లోనే టికెట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఆన్ లైన్ లో 24 గంటల్లో 10 లక్షల టికెట్లు అమ్ముడయినట్టు బుక్ మై షో తెలిపింది.  బాహుబలి చిత్రం టికెట్లు సాధించడం అంటే ఎవరెస్టు ఎక్కినంత సంబరపడిపోతున్నారు ప్రేక్షకులు.
భారతీయ సినీ రికార్డులన్నీ బాహుబలి తిరగరాస్తోంది. టీజర్ విడుదల దగ్గర నుండి బాహుబలి సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. యూ ట్యూబ్ లో బాహుబలి టీజర్ ను మూడు కోట్ల మందికి పైగా వీక్షించారు. ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న బాహుబలి చిత్రం తెలుగు సినిమా ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలికి వచ్చినంత క్రేజ్ మరే సినిమాకు రాలేదనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద బాహుబలి కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రేక్షకుల ఎదురు చూపులు కొన్ని గంటల్లోనే తొలగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *