నగరంలోనూ కేబుల్ బ్రిడ్జ్

హైదరాబాద్ లో హ్యాంగింగ్ బ్రిడ్జీ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. నగర సిగలో మలో మణిహారంగా రూపుదిద్దుకోనున్న ఈ బ్రిడ్జి నిర్మాణం సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. జూబ్లీహిల్స్ దుర్గం చెరువపై 1.04 కిలీమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 184 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టినట్టు చెప్పారు. దుర్గం చెరువు సూందరీకరణ పనులను కూడా 3.5 కోట్లతో చేపడుతున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల్లోకి మరో ప్రదేశం చేరబోతోందని చెప్పారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. ఈ కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహీల్స్ నుండి హైటెక్ సిటీకి అత్యంత సులభంగా చేరుకోవచ్చని ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ప్రయాణ సమయంలో కూడా గణనీయంగా మార్పువస్తుందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జీ నిర్మాణానికి కావాల్సిన సాంకేతికతతో పాటుగా పిల్లర్లు ఇతర నిర్మాణాలు విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయి.
అభివృద్ది చెందిన దేశాలకు మాత్రమే పరిమితం అయిన కేబుల్ బ్రిడ్జి ఇప్పుడు నగరం వాసులకు అందుబాటులోకి రానుంది.  దీని వల్ల పర్యాటక రంగం అభివృద్ది చెందడంతో పాటుగా ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *