హతవిధీ…కేజ్రీ…

0
49

భారత రాజకీయాల్లో కొత్త శకం తీసుకుని వస్తానని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ మున్సిపల్ ఓటర్లు దిమ్మతిరికే షాక్ ఇచ్చారు. పంజాబ్, గోవా రాష్ట్రాల ఫలితాలతో ఇప్పటికే డీలా పడ్డ ఆప్ కు తాజా ఎన్నికల ఫలితాలు మరింత కష్టాలను తీసుకుని వచ్చాయి. రాజకీయాలను ప్రక్షాలను చేస్తానంటూ వచ్చిన ఆప్ ఢిల్లీలో అధికారంలోకి రావడం ద్వారా దేశరాజకీయాల్లోనే గొప్ప సంచలనంగా నిల్చింది. అటు మీడియా తో పాటుగా మేధావులు, సామాన్యులు, మద్యతరగతి వర్గాలు ఆప్ మద్దతు పలికారు. రాజకీయాల్లోనుండి చెత్తను ఊడ్చేస్తేనంటూ తన ఎన్నికల చిహ్నాన్ని చీపురుకట్టగా పెట్టుకున్న ఆప్ సృష్టించిన సంచలనం దేశంలో సంప్రదాయ  పార్టీలనే కొద్దిరోజుల పాటుగా ఒక ఊపు ఊపింది. అన్నాహజారే శిష్యుడిగా తకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐఐటీ మేధావి హజారుకు క్రమంగా దూరం అయ్యారు. రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో సత్తా చాటారు. ముఖ్యంగా రెండో సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని చేపట్టింది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా నిత్యం కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వి విమర్శలపాలైన కేజ్రీవాల్ అటు పార్టీనీ ఇటు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టలేకపోయారనే విమర్శలున్నాయి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఢిల్లీ శాంతి భ్రతతల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలు దువ్విన కేజ్రీవాల్ మోడీని విమర్శించడమే పనిలో పెట్టుకున్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని విమర్శిస్తే మోడీపై నిప్పులు కురిపించారు. దీనితో ఢిల్లీ పాలన కంటే దేశరాజకీయాలపై ఆశక్తి చూపిస్తున్నారంటూ కేజ్రీవాల్ పై విమర్శలు మొదలయ్యా. అదే సమయంలో సొంత పార్టీ నేతలు అటు అవినీతి కార్యకలాపాల్లో ఇరుక్కోవడంతో పాటుగా కొంత మందిపై లైంగిక వేధింపులు లాంటి తీవ్ర ఆరోపణలతో కేజ్రీవాల్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. నీటి బిల్లులు, కరెంటు ఛార్జీల వంటి విషయంలో కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు ఢిల్లీ ప్రజలకు దగ్గర చేశాయి.
పరిపాలనలో కొత్త ఒరవడి తీసుకుని వచ్చిన కేజ్రీవాల్ పనితీరు పై మంచి మార్కులే పడ్డప్పటికీ ఆయన కేంద్ర ప్రభుత్వంతో అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరితో పాటుగా పరిధికి మించి కేజ్రీవాల్ మోడీ పై చేసిన ఆరోపణలు ఆయన ఇమేజ్ ను దెబ్బతీశాయి. కొన్ని సందర్భంగా కేజ్రీవాల్ విమర్శలు నవ్వుల పాలయ్యాయి. తాజాగా ఎన్నికల ఫలితాలను పై తప్పంతా ఈవీఎంలదే అంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై కూడా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here