కళాతపస్వికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

0
79

ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వాథ్ కు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును విశ్వానాథ్  కు అందచేస్తున్నారు. తొలుత సొండ్ ఇంజనీర్ గా కేరీర్ ను ప్రారంభించిన కే.విశ్వనాధ్ అనేక అరుదైన చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో వేటికవే ప్రత్యేకం. ‘ఆత్మ గౌరవం’ చిత్రం ద్వారా తొలిసారి దర్శకుడిగా మారిన విశ్వనాధ్ అనేక ఆణిముత్యాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సిరిసిరి మువ్వతో కే.విశ్వానాధ్ పేర చిత్రపరిశ్రమలో మారుమ్రోగిపోయింది. ‘శంకరాభరణం’ చిత్రానికి గాను ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. ‘స్వాతి ముత్యం’ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఆయన నిర్మించిన అనేక చిత్రాలకు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో లభించాయి.
సిరివెన్నేల, స్వర్ణకమలం, సాగర సంగమం, శృతిలయలు, సూత్రధారులు, స్వాతికిరణం లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విశ్వనాధ్ చిత్రాల్లో నటించడం ఒక గౌౌరవంగా నటీనటులు భావిస్తుంటారు. కళలపట్ల అమితాశక్తి ప్రదర్శించే విశ్వానాథ్ చిత్రాలన్నీ సాధారణంగా ఏదో ఒక కళ చుట్టూ తిరుగుతాయి. సునిసిత హాస్యంతో చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం ఆయన దర్శక బాధ్యతల నుండి తప్పుకుని నటుడిగా మెప్పిస్తున్నారు. విశ్వనాధ్  దర్శకత్వం వచించిన చిత్రాలు…

 • ఆత్మ గౌరవం
 • అల్లుడు పట్టిన భరతం
 • సిరి సిరి మువ్వ
 • సీతామాలక్ష్మి
 • శంకరాభరణం
 • సప్తపది
 • ఆపద్భాందవుడు
 • శృతిలయలు
 • స్వాతికిరణం
 • స్వాతిముత్యం
 • స్వర్ణకమలం
 • అమ్మ మనసు
 • శుభలేఖ
 • శుభోదయం
 • శుభ సంకల్పం
 • సిరివెన్నెల
 • సాగరసంగమం
 • స్వయంకృషి
 • జననీ జన్మభూమి
 • చిన్నబ్బాయి
 • సూత్రధారులు
 • స్వరాభిషేకం
 • జీవిత నౌక
 • కాలాంతకులు
 • జీవన జ్యోతి
 • ప్రేమబంధం
 • చెల్లెలి కాపురం
 • నిండు హృదయాలు
 • చిన్ననాటి స్నేహితులు
 • ఉండమ్మా బొట్టు పెడతా
 • కలిసొచ్చిన అదృష్టం
 • ప్రైవేటు మాస్టారు
 • శారద
 • కాలం మారింది
 • ఓ సీత కథ
 • శుభప్రదం

 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here