రాజకీయ రంగ ప్రవేశంపై బ్రాహ్మణి ప్రకటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి తన రాజకీయ రంగ ప్రవేశం గురించి స్పస్టమైన ప్రకటన చేశారు.  బ్రాహ్మణి త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. ప్రస్తుతం తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే తనకు లేదని బ్రాహ్మణి స్పష్టం చేశారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విషయాన్ని చెప్పార. నారా బ్రహ్మణి రాజకీయాల్లో రాబోతున్నారని ఆమె విజయవడ లోక్ సభ స్థానం నుండి పోటీచేస్తారంటూ వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి రావాలని బ్రాహ్మణి ఆశక్తితో ఉన్నారని ఇదే సమయంలో ఆమె సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్టు వార్తలు షికార్లు చేశాయి.

ఇప్పటికే తన భర్త ఏపీ మంత్రి వర్గంలో ఉన్నందున బ్రాహ్మణిని లోక్ సభకు పంపుతారనే వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని బ్రాహ్మణి స్పష్టం చేశారు.