జాతీయ క్రీడాకారిణీ తలాక్ బాధితురాలే

0
67

జాతీయ స్థాయి క్రీడాకారిణికీ తలాక్ కష్టాలు తప్పలేదు. ఆమె చేసిన పాపమల్లా ఆడపిల్లకు జన్మనివ్వడమే. జాతీయ నెట్ బాల్ చాంపియన్ షామల్యా జావేద్ అడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంగా ఆమె భర్త ఆజం అబ్బాసీ ఆమెకు ఫోన్ లో తాలాక్ చెప్పాడట. దీనిపై ఆమె ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లేఖద్వారా ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షామల్యా జావేద్ కు 2014లో వివాహం జరిగింది. అప్పటి నుండి తనకు వరకట్న వేధింపులు ఉండేవని అదనంగా తన తండ్రి మరో మూడు లక్షల కట్నం ఇచ్చినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు లేవని ఆమె చెప్పుకొచ్చారు.
గర్భం దాల్చిన సమయం మగపిల్లవాడికే జన్మనివ్వాలంటూ అత్తింటి వారు హుకూం జారీచేశారని ఆడపిల్ల పుట్టేసరికి తన భర్త ఫోన్ చేసి తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు వాపోయింది. జాతీయ  స్థాయి క్రీడాకారిణి అయినా తనకు అత్తింటి వేధింపులు, భర్త పెట్టే హింసా తప్పలేదని ఆమె అనింది. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందిచలేదని ఆమె ఆరోపించారు. తన భర్త మద్దతు ఇస్తున్నట్టుగా పోలీసులు మాట్లాడారని ఆమె చెప్పారు. మూడు తలాక్ ల వ్యవహారంలో ప్రధాన మంత్రి కఠినంగా వ్యవహరించాలని ఆమె కోరారు. తన లాంటి వారు ఎంతో మంది ఉన్నారని వారందరినీ ఆదుకోవాలని ఆమె కోరారు. మూడు తలాక్ లు చెప్పడం ద్వారా భార్యలను వదలించుకునే పద్దతి మారాలని ఆమె అన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here