తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వేడి

0
62

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా ఓకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో లోక్ సభతో పాటుగా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో రాజకీయ పక్షాలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయాయి. షెడ్యూల్ ప్రకారం 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. దీనితో పార్టీలు, నాయకులు ముందస్తు వ్యవహాల్లో మునిగిపోయారు. సోమవారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడి జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆలోచనను బయటపెట్టడంతో పాటుగా ఈ విషయంలో తమ ప్రభుత్వం గట్టిపట్టుదలతో ఉన్నట్టు స్పష్టం చేయడంతో ముందస్తు ఎన్నికలు అనివార్యంగానే కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి గత కొద్దిరోజుల క్రితమే మొదలైనట్టు కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయి. అధికార పార్టీలు ఒక అడుగు ముందే ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వివిధ ప్రజాకర్షక పథకాలతో ప్రజల్లోకి దూసుకుని పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న సభల ద్వారా ప్రజల్లోకి చొచ్చుకునే పోతుండగా టీఆర్ఎస్ ప్లీనరీ 27న జరిగే వరంగల్ సభల ద్వారా ఎన్నికల నగారా మోగించేందుకు సిద్ధపడుతోంది. విపక్ష కాంగ్రెస్ పోటీలో వెనుకబడ్డప్పటికీ అడగా దడపా నిరసన కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు అంటూ హడావుడి చేస్తోంది.  వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలోకి రావడం ద్వారా మంచి ఉపు మీద ఉన్న బీజేపీ కూడా తెలంగాణలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణలో సత్తా సాటేందుకు సిద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలు రెండిటిలో పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన తెలంగాణలో ప్రజాగాయకుడు గద్దర్ సహాయంతో ప్రజల్లోకి వెళ్లే  ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. అధికార టీడీపీ  విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు కాస్తా వ్యక్తిగత పోరుగా మారిపోయింది. వ్యక్తిగత విమర్శలు ప్రతివిమర్శలతో ఏపీ హోరెత్తిపోతోంది. అసెంబ్లీ సమావేశాలు మొదలు కొని ప్రతీ చోటా వ్యక్తిగత ధూషణలు తీవ్రం అయ్యాయి. ఇప్పటివరకు అధికార టీడీపీనే రేసులో ముందున్నప్పటికీ వైసీపీ కూడా గట్టిగానే పోటీనిస్తోంది. జనసేన ప్రభావం తెలంగాణ కన్నా ఏపీలోనే ఎక్కువగా కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గతంలో తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు  ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత  ఆ రెండు పార్టీలను ప్రధానంగా టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంతో ప్రధానంగా ఈ రెండు పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టిన పవన్ తన విమర్శల జోరును మరింత పెంచుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు చందంగా మారింది. ఏపీ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారయింది.
మొత్తం మీద తెలుగు  రాష్ట్రాల్లో ఎన్నికల సమరాంగణానికి పార్టీలు సిద్ధమవుతుండడంతో ఎన్నికల వేడి ముందుగానే రాజుకుంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here