దేశాభివృద్ది సమష్టి బాధ్యత:మోడీ

0
68
The Prime Minister, Shri Narendra Modi chairing the 3rd Governing Council Meet of the NITI Aayog, in New Delhi on April 23, 2017.

నవ భారత నిర్మాణానికి ప్రతీ ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశాంలో ప్రధాని ప్రసంగించారు. రానున్న 15 సంవత్సరాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెప్ట్ నెట్ గవర్నర్ లు , కేంద్ర మంత్రులు ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి  హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే భారత్ అభివృద్ది చెందుతుందని మోడీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయంతో జీఎస్టీ బిల్లు కు ఆమోదం లభించడం చారిత్రాత్మక నిర్ణయమని ఇదే స్పూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిలషించారు. వ్యవసాయం, ఉపాధి కల్పన, దారిద్య నిర్మూలన వంటి అంశాలపై తీకుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చ జరిగింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించారు. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలను గుంరించి సదస్సులో చర్చ జరిగింది.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here