మన వారికా సత్తా ఉంది

0
60
Hacker using laptop. Lots of digits on the computer screen.

భారతదేశంలోని ఐటి విద్యార్థులను ఎందుకూ పనికిరానివారిగా చిత్రిస్తూ విడుదల అయిన యాస్పైర్ మైండ్స్ నివేదికపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  95 శాతం మంది ఐటి విద్యార్థులకు కోడ్ రసే  సత్తాలేదంటూ ఆ  సర్వేలో పేర్కొన్నారు. ఇది విద్యార్థులను ఖచ్చితంగా తక్కువచేసి చూపించడమే అవుతుందని వారు అంటున్నారు. 95 శాతం మంది విద్యార్థులకు కోడ్ రాయడం రాదు అనడం పూర్తిగా అర్థరహితమని వారంటున్నారు. ఈ సర్వేని ఒక పనిమాలిన చెత్త సర్వేగా మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ టీవీ మోహన్ దాస్ పాయ్  పేర్కొన్నారు. ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు భారతీయ విద్యార్తుల్లో లేవంటూ వెలువడిన సర్వేపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత విద్యార్థుల్లో కేవలం 4.77 శాతం మంది మాత్రమే కంప్యూటర్ ప్రోగ్రాకు సంబంధించి సరైన లాజిక్ ను రాయగలరంటూ సర్వేలో పేర్కొనడం దారుణమని నిపుణలు అంటున్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు  కిరణ్ మజుందార్‌ షా కూడా సర్వేను తప్పు పట్టారు. కేవలం ఊహజనిత సర్వేలు చేస్తూ తప్పుదారి పట్టించడం సరైంది కాదన్నారు. అసలు ఈ సర్వే ఎప్పుడు చేశారు, ఎంత మందిని ప్రశ్నించారో సరైన వివరాలు ఇవ్వకుండా విద్యార్థులపై అభాండాలు వేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here