ఇదేం సెల్ఫీరా బాబు..ప్రాణం మీదకు తెచ్చిన సరదా

సెల్ఫీ పిచ్చి ముదిరిపాకాన పడుతోంది. రకరకాల సెల్ఫీ  తీసుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రచారం పొందాలనుకుంటున్న యువత చివరకు ప్రాణం మీదకు తెచ్చుకుంటోంది. ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మెడకు ఉరిబిగించుకుని సెల్ఫీకి ప్రయత్నించిన ఒక యువకుడు నిజంగానే తాడు మెడకు బిగుసుకుపోవడంతో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో జరిగింది. మెడకు ఉరితాడు బిగించుకుని సెల్పీ తీసుకునే క్రమంలో స్టూల్ పక్కకి ఒరగడంతో నిజంగానే మెడకు ఉరిబిగుసుకు పోయింది. ఐతే అదృష్టవశాత్తు దగ్గరలోనే అతని మిత్రుడు ఉండడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
హుటాహుటిన సదరు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. సెల్ఫీల మోజులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *