వాట్సప్ పోస్టులపై కేసు ఒకరి అరెస్ట్…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేశ్ తో పాటుగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. . సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్న కామెంట్లతో ప్రభుత్వానికి, వ్యక్తులు, చట్ట సభల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నందుకు ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిపై కేసును నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు శృతిమించడంతో ఎపి ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
వైసీపీ ఒక పథకం ప్రకారం ఆంధ్రప్రదేశ్  కు చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చట్ట సభల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి వైసీపీ ఉద్యోగిగా తేలినందున అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన వైసీపీ అధినేతపై కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టులు పెట్టిన వారిని వేధిస్తున్న పోలీసులు వైసీపీ అధినేతపై అసభ్య ప్రచారం చేస్తున్న వారిని ఎందుకు అరెస్టు చేయడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో వికృత వ్యాఖ్యలకు అడ్డుపడితేనే మంచిది. విమర్శల స్థాయిని దాటిపోయి శృతిమించిన పోస్టులకు ముగింపు పలకాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *