శృతిమించుతున్న సోషల్ మీడియా వార్

0
65

తెలుగుదేశం పార్టీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడు వాట్సప్, ఫేస్ బుక్ యుద్ధం నడుస్తోంది. దీని కోసం ఇరు పార్టీ్లలో ప్రత్యేక వ్యవస్థలు కూడా నడుస్తున్నట్టు సమాచారం. చాలా రోజుల నుండే ఈ వాట్సప్ వార్ జరుగుతుండగా ఇటీవల కాలంలో ఇది పతాక స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలకు చెందిన వారు వైరి పక్షంలో వ్యంగ్యాస్థాలు సందించుకుంటూ వాటిని తమ కార్యకర్తల ద్వారా జనాల్లోకి పంపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా తాజాగా వైసీపీ నేతలు లోకేష్ ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. లోకేష్ సంబందిచిన వీడియోలు, ఫొటోలకు వ్యంగంగా కామెంట్లు పెడుతు సర్కులేట్ చేస్తున్నారు. ఈవాట్సప్ యుద్ధంలో అటు టీడీపీ ఇటు వైసీపీ  నేతలు, కార్యకర్తలు, అభిమానాలు కీలకంగా మారారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక గ్రూపుల్లో ఇప్పుడు ఈవాట్సప్ మెసేజ్ లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
వివిధ సందర్భాల్లో నేతలు మాటతూలిన, పొరపాటుగా మాట్లాడిన వీడియో క్లిప్పింగులతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల లోకేష్ రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్.అంబేద్కర్ జయంతిని వర్థంతిగా పొరపాటను పకలకడంతో పాటుగా నీటి సమస్యపై, నియోజకవర్గాలపై అతను చేసిన వ్యాఖ్యలు వైరల్ మారాయి. వీటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుండడంతో దీనికి పోటీగా జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు, పొరపాట్లను ఎత్తి చూపుతూ టీడీపీ అభిమానులు కూడా వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇరు పార్టీల వద్ద మంచి విజువల్ బ్యాంకింగ్ ఉండడంతో అప్పటికప్పుడు వీడియోలు బయటకి వస్తున్నాయి.
వాట్సప్ వార్ సరదా స్థాయిని దాటి మరీ శృతిమించుతున్నట్టే కనిపిస్తోంది. వంగ్యస్థాల స్థాయిని దాటి తీవ్ర ధుషణలను దారితీస్తున్న వాట్సప్ మెసేజ్ లపై ఇప్పటికే పోలీసులు దృష్టిపెట్టారు. చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా జగన్ పై వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here