ఎర్రబుగ్గ కార్లకు మంగళం

కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రోటోకాల్ అంటూ కార్లపై ఎర్ర బుగ్గను ఇక పై నుండి కనుమరుగు కానున్నాయి. మే1వ తేదీ నుండి ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించుకుంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో సహా దేశంలోని ఎవరికార్లపైనా ఇకపై ఎర్ర బుగ్గలు ఉండవు. వీవీఐపీల కార్లపై సైతం ఎర్రబుగ్గలను తొలగించడం గమనార్హం. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ మీడియాకు వెళ్లడించారు. అంబులెన్స్ లు, సైనిక వాహనాలు, పోలీసు అధికారులకు ఉండే నీలం బుగ్గను మాత్రం కొనసాగిస్తారు.
ఎర్రబుగ్గ కార్ల హడావుడి దేశంలో కనిపించకుండా పోతుందని గడ్కారీ చెప్పారు. ఒక్క అత్యవసర వాహనాలకు తప్ప ఇతర వాహనాలపై ఎర్రబుగ్గలు ఉండవని గడ్కారీ స్పష్టం  చేశారు. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం మే1 నుండి అమల్లోకి వస్తుందని అప్పటి వరకు ఎర్రబుగ్గలు కొనసాగుతాయని గడ్కారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *