రేవంత్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు

0
55

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తమ గ్రామానికి రావద్దంటూ సిద్దిపేట మండలం చింతమడక గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. దీనితో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన గ్రామంలో పర్యటించేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలను అంతకు ముందు పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ స్వంత గ్రామంలో  ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి రావడం ఉధ్రిక్తతకు దారితీసింది. తమను అడ్డుకున్న పోలీసులతో రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గ్రామంలో పర్యటించకుండా తమని అడ్డుకోవడం దారుణమన్నారు.  వాహనాలు వదిలి కాలినడకను గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలను గ్రామస్థులు అడ్డుకున్నారు.
తమ గ్రామంలోకి రేవంత్ రెడ్డిని అడుగుపెట్టనీయమంటూ గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపించారు. రైతుల పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here